Latest Updates

  ➤ View More »  

Online Tests(Quizes) for SSC Students

  ➤ View More »  



  ➤ View More..  


  ➤ View More..  

9 Dec 2013

ఇ.హెచ్.యఫ్ తరచు అడిగే ప్రశ్నలు:
హెల్త్ కార్డు -అనుమానాలు-పరిష్కారాలు .......జలందర్ రెడ్డి ఆదిలాబాద్
అర్హత
1.ఇ.హెచ్.యఫ్ అంటే ఏమిటి?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వారి ఫై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వద్ద ఏమ్పనేల్మేంట్ అయిన నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారా నగదు రహిత వైద్య సేవలు, శస్త్రచికిత్సలు అందించేందుకు ఉద్దేశించబడిన పధకం 'ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి'. ప్రస్తుతం ఎ.పి.ఐ.ఎం.ఎ నిబ్బందనలు 1972 ప్రకారం ప్రస్తుతం అమలులో వున్న 'వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు' (మెడికల్ రి- ఇమ్బెర్మెంట్ ) విధానానికి బదులుగా ఈ పధకం పనిచేస్తుంది.
2. అర్హులు ఎవరు?


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల,పెన్షనర్లు వారి ఫై ఆధార పడిన కుటుంబ సభ్యుల అందరికి ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి నగదు రహిత వైద్యం అందిస్తుంది. ఈ పధకం ద్వారా ప్రయోజనం పొందిన వారికి ఎ.పి.ఐ.ఎం. ద్వారా అందే ప్రయోజనాలు నిలిచిపోతాయి. క్రింద పేర్కొన్న విభాగాలకు చెందిన వారు లబ్దిదర్లు
ప్రస్తుతం పనిచేస్తున్న
క్రమబద్దకారించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరు
స్థానిక సంస్థలలో ప్రొవినశివిజేడ్ ఉద్యోగులు
విశ్రాంత (రిటైర్డ్) ఉద్యోగులు
సర్వీసు పెన్షన్దారులు
కుటుంబ పెన్షన్ పొందుతున్నవారు (వీరి ఫై ఆధారపడినవారికి వర్తించదు)
తిరిగి ఉద్యోగం పొందిన సర్వీసు పెన్షన్దారులు
క్రింద పేర్కొన్న వారు కుటుంబాన్ని ఏర్పరుస్తారు
తల్లితండ్రులు (ఉద్యోగిని దత్తత తీసుకున్న తల్లితండ్రులు గాని, కన్న తల్లితండ్రులు గాని, ఎవరో ఒకరు)
పురుష ఉద్యోగి/ పెన్షనరు విషయంలో చట్టబద్దంగా వివాహం చేసుకున్న భార్య ఫై ఆధారపడిన తల్లితండ్రులు
మహిళా ఉద్యోగి లేదా సర్వీసు పెన్షనరు విషయంలో భర్త అతని ఫై ఆధారపడిన తల్లితండ్రులు
పూర్తిస్థాయిలో ఆధారపడిన చట్టబద్దమయిన పిల్లలు (సవతి పిల్లలు, దత్తత పిల్లలతో సహా)
ఆధారపడటం అంటే కింది అర్ధం కలిగి వుంది
తల్లితండ్రుల విషయంలో ఉద్యోగి ఫై పోషణకు ఆధారపడినవారు
నిరుద్యోగ కుమార్తెల విషయంలో, అవివాహితులు, వైధవ్యం పొందినవారు, విడాకులు పొందినవారు, భర్త చే త్యజించబడినవారు
నిరుద్యోగ కుమారుల విషయంలో, 25 సంవత్సరాలలోపు వయస్సున్నవారు, ఉపాధి/ఉద్యోగం పొందడంలో వైఖల్యం వల్ల విఫలం అయ్యే అంగ వికలంగురు
భార్య, భర్త లిరువురు ఉద్యోగాలు లేదా సర్వీసు పెన్షన్దారులు అయినప్పుడు వారి పిల్లల నమోదు విషయంలో డుప్లికేషన్ ఉండరాదు. ఇతర ప్రభుత్వ భీమా పధకాలు అయిన సి.జి.హెచ్.ఎస్ వంటి వాటిలో ప్రయోజనం పొందేవారు, ఈ పధకంలో అనర్హులు.

3. వర్క్ చర్జేడ్ ఉద్యోగులు, నామినల్ మస్టర్ రోల్ పనివారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అర్హులా?
లేదు. వారు ఈ పధకం క్రింద ప్రయోజనం పొందడానికి అర్హులుకారు.క్రమబద్దికరించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల్లో ప్రొవిన్శ్లేజేడ్ ఉద్యోగులు, సర్వీసు పెన్షనరులు అందరు, ఆధారపడిన కుటుంబ సబ్యుల్ని మినహాయించి, కుటుంబ పెన్షనరులు మాత్రమే ఈ పధకంలో అర్హులు
4. అవివాహితులు అయిన నిరుద్యోగులైన కుమార్తెలు ఈ పధకంలో అర్హులా?
అవును. నిరుద్యోగులైన కుమార్తెలు, వైదవ్యం పొందిన, భర్తచేత్యజించిన కుమార్తెలు ఈ పధకంలో అర్హులు. వివాహం అయితే ఆమె అర్హురాలు కారు.
5. జిల్లా గ్రంధాలయ సంస్థలు వంటి సంస్థల ఉద్యోగులు, సొసైటీ ఉద్యోగులు ఈ పధకంలో ప్రయోజనం పొందడానికి అర్హులు కారా?
ఆగస్ట్ 14 ,2012 నాటికి క్రమబద్దికరించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అర్హులు. అయితే,సొసైటిలు, కార్పోరేషన్లు, యునివరసిటిలు, ఎఇదెద్ టీచర్ల మొదలైన ఉద్యోగుల అర్హత విషయంలో ప్రభుత్వ ఉతర్వులు వెలువడాల్సి వుంది.
6. న్యాదిపతులు, న్యాయవాదులు, స్టాన్డింగ్ కౌన్సిల్ అర్హులా?
లేరు.వారు అర్హులు కారు. న్యాయవ్యవస్తని మినహాయించడం జరిగింది. ప్రభుత్వ ప్లీదర్లు వంటి టెన్యురు ఉద్యోగులు మినహాయింపబడ్డారు.
7. ఉద్యోగి తల్లితండ్రులకు ఆరోగ్యశ్రీ కార్డు వుంటే, వారు ఈ పధకంలో అర్హులేనా?
ఆరోగ్యశ్రీ కార్డు (తెలుపు రేషన్ కార్డు) దారిద్యరేఖకు దిగువున వున్న కుటుంబాలకు మాత్రమే జారీ చేయబడుతుంది. ఉద్యోగి తల్లితండ్రులు పోషణకు ఆధారపడి వుంటే, వారి తెలుపు రేషన్ కార్డు రద్దుచేయబడుతుంది. పేదల ప్రయోజనాన్ని వినియోగించుకున్నందుకు ఆ ఉద్యోగి ఫై క్రమశిక్షణచర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగి తల్లితండ్రులు స్వతంత్రంగా ఉన్నట్లయితే వారు ఆరోగ్యశ్రీ కార్డు కలిగి వుంటే ఈ పధకంలో చేరేందుకు అర్హులు కారు.
8. ఎన్రోల్ల్మేంట్ సమయానికి ఒక ఉద్యోగి రిటైర్ అయితే, ఆ ఉద్యోగి ఏ విభాగానికి చెందుతారు?
ఎన్రోల్ల్మేంట్ సమయంలో ఉద్యోగి స్థాయి ఏమిటనేదే సూచిక. ఉద్యోగి రిటైర్ అయితే పెన్షన్దారు అవుతారు. పెన్షన్ మంజూరు అయిందా లేదా అనేది అప్రస్తుతం.
9. పురుష ఉద్యోగి విషయంలో అతని అత్తమామలు (భార్య తల్లిదండ్రులు ) అర్హులేనా ?
లేదు. ఉద్యోగి తల్లిదండ్రులు మాత్రమే అర్హులు
10. దత్తత పిల్లలు, ఉద్యోగి దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందుతారా?
అవును. ఉదోగిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులలో ఎవరో ఒక తల్లిదండ్రులు మాత్రమే అర్హులు. దత్తత పిల్లలు కూడా ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి అర్హులే. వారి దత్తత చట్టబద్దమయినదిఅయితే.
11. 25 సంవత్సరాలు ఫైబడిన నిరుద్యోగి అయిన కుమారుడు ఉదోగి ఫై ఆదారపడి వుంటే, అతను అర్హుడా?
లేదు,25 ఏళ్ల వయసున్న కుమారుడు అనర్హుడవుతడు. అతని దగ్గరున్న ఆరోగ్య కార్డు దానతట అదే పనిచేయడం ఆగిపోతుంది
12. భార్యాభర్తలు ప్రభుత్వ సర్వీసులో వుంది, ఒకరు ఇ.ఎస్.ఐ లేదా ప్రైవేటు వైద్య భీమా కలిగి వుంటే వారు అర్హులవుతారా?
ప్రైవేటు వైద్య భీమా పతకంలో వున్నభార్య గాని, భార్తగాని ఈ పతకంలో చేరేందుకు అర్హులే. కాని ఇ.ఎస్.ఐ పథకం క్రింద ప్రయోజనం పొందుతుంటే ఈ పతకంలోచేరేందుకు అనర్హులు.
13. ఆరోగ్య భద్రత పధకం క్రింద పోలీసు శాఖ పోలీసులకు కొన్ని ప్రయోజనాలు మాత్రమే కల్పిస్తుంది. పోలీసు ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు అర్హులేనా ?
లేదు, 14 .08 .2012 నాటికి ఆరోగ్య భద్రత పధకంలో ప్రయోజనం పొందుతున్న పోలీసు ఉద్యోగులు వారి తల్లితండ్రులు ప్రయోజనం పొందపోయినప్పటికీ ఈ పధకంలో అర్హులు కారు.
14. నిరుద్యోగ కుమార్తె అవివాహిత అయితే ఈ పధకంలో అర్హులేనా?
అవును, నిరుద్యోగ కుమార్తెలు అవివాహితలు, వైదవ్యంపొందినవారు. విడాకులు పొందినవారు భర్తచే వదిలివేయబదినవారు అర్హులే. వివాహితలుఅయితే మాత్రం అర్హులు కారు.
ఎన్రోల్ల్మేంట్
15. ఇ.హెచ్ .ఎఫ్. ను ఎలా చేరుకోవాలి?
ఈ పధకంలో చేరాలంటే మీకు ఒక ఆరోగ్య కార్డు వుండాలి. (www . ehf . gov .in ) వెబ్ సైటులో వున్న సూచనల ప్రకారం ఈ ఫారం సమర్పించి మీరు నమోదుకావాలి. అలా చేసిన తర్వాత మీకు 'ఆరోగ్య కార్డు' అందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వున్న ఏమ్పనేలేడ్ ఆసుపత్రుల ద్వారా ఈ పధకం ప్రయోజనాలు పొందెందుకు లబ్దిదార్లకు వీలుకలుగుతుంది.
16. ఎన్రోల్మెంట్కు ఆధార్ నెంబర్ తప్పనిసరి. కాని చాలామంది ఉద్యోగులు ఆధార్ కార్డ్లు లేవు. వారు ఏవిదంగా ఎన్రోల్ అవుతారు?
ప్రత్యేకంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఆధర్ కార్డ్లు జారీకి ఆధార్ సెంటర్లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరా శాఖను, జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆధార్ కార్డు నెంబర్ వున్న ఉద్యోగులు ఈ పధకంలో నమోదుకు అర్హులు అవుతారు. దరఖాస్తులు ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ పూర్తిచేసే విధానంఫై సూచనలు చదవండి.
17. ఈ పధకం కింద ఒక ఉద్యోగి ఎన్రోల్ కాకపోతే, ఈ పధకానికి విరాళం చెల్లించవచ్చా ?
ఉద్యోగి ఈ పధకంలో ఎన్రోల్ అయినా, అవకపోయినా ఈ విషయంలో నిమిత్తంలేకుండా వేతన చెల్లింపు అధికారి (డి.డి.ఒ) స్థాయిలో వేతన స్కేలు ఆధారంగా విరాళం మినహాయింపు జరిగిపోతుంది. తమ స్వంత ప్రయోజనం కోసం ఈ పధకంలో ఉద్యోగి చేరడం తప్పనిసరి ఎందుకంటే ఉద్యోగి విరాళం జీతం నుంచి క్రమంతప్పకుండా మినహాయింపు జరుగుతుంది.
18. ఈ పధకంలో కుటుంబం అంతటికి ఒక కార్డు రేషన్ కార్డు మాదిరిగా ఇవ్వడం జరుగుతుందా?
లేదు. ఉద్యోగికి, అతని కుటుంబ సబ్యులకు కార్డ్లు వ్యక్తిగతంగా జారీ చేయబడతాయి. ఇందుకోసం ఐ.సి.ఎ.ఒ పద్ధతిలో తీసిన ఉద్యోగి, అతని ఫై ఆధారపడ్డ కుటుంబసబ్యులు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీయించుకొని అప్ లోడ్ చేయాలి. విదేశియానానికి దరఖాస్తుచేసే పాస్ పోర్ట్ పెట్టె దరఖాస్తు ఫై ఐ.సి.ఎ.ఒ పద్ధతిలో తీసిన ఫోటోలనే అతికించడం జరుగుతుంది. ఫోటోగ్రాఫర్కి ముందుగానే ఈ విషయాన్నీ చెప్పాలి.
19. భార్యాభర్తలిద్దరు ప్రభుత్వ ఉద్యోగులయితే విరాళం ఎవరు కట్టాలి?
భార్యాభర్తలిద్దరు ప్రభుత్వ ఉద్యోగులయితే, సర్వీసు పెన్షన్దారులు అయినా, యిద్దరు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధికి విరాళం చెల్లించాల్సిందే. ఎన్రోల్మెంట్ సమయంలో వారి ఫై ఆధారపడిన కుటుంబసబ్యులని వరుఇరువురు పంచుకోవచ్చు.
ప్రయోజనం
20. ప్రయోజనం ఎంత వుంటుంది?
జాబితాలోని చికిత్సల వివరాలను వెబ్ సైటులో పరిశిలించి తేల్చుకోవచ్చు. అన్ని వ్యాధులు, అంతకుముందు నుంచి వున్న వ్యాధులు కూడా మొదటి రోజు నుంచి కలర్ చేయబడతాయి. ప్యాకేజిలో భాగంగా ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి డిసఛార్జ్ అయిన 10 రోజుల తర్వాత వరకు వైద్యం అందించాలి.
21. ఆర్ధికపరమయిన కవరేజ్ ఎంత?
ఇ.హెచ్.ఎఫ్. పధకం క్రింద కుటుంబానికి సంవత్సరానికి భీమా సొమ్ము 3 లక్షలు విధానంలో వుంది. ఇ.హెచ్.ఎఫ్ ను ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు 40 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నిధులు సమకూర్చి సంయుక్తంగా నిధిగా నిర్వహిస్తారు. ఎన్రోల్మెంట్ విరాళం తప్పనిసరి, భార్యభార్తలిరువురు ఉద్యోగులు సర్వీసు, పెన్షన్దరులయితే ఎన్రోల్మెంట్, విరాళం ఇద్దరికీ తప్పనిసరి, ఎటువంటి పరిస్థితుల్లోను ఆధారపడ్డ కుటుంబ సభ్యుల పేర్లు డిక్లరెసిన్ను అంగీకరించరు.
22. ఆర్ధికపరమయిన కవరేజ్ 3 లక్షలు వైద్యం ఖర్చు పెరిగితే, కవరేజ్ పెంచుతారా?
అవును. ప్రత్యేక మిగులు నిధి నుంచి అవసరమయిన నిధులను అదనంగా అందుబాటులో ఉంచుతారు. 3 లక్షలు భీమా మొత్తం దాటిపోయిందని వైద్యం ఆపుచేసే అవకాశం లేదు.
23. ప్రస్తుత ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఇ.హెచ్.ఎఫ్. పధకం క్రింద ఆరోగ్య కార్డ్లు పొందిన ఉద్యోగులకు వైద్యం అందించడం, సౌకర్యాల కల్పన, ఖర్చయ్యే సొమ్ము ఫై సిలింగ్లలో వున్న వ్యత్యాసాలు ఏమిటి?
ఆరోగ్యశ్రీ పధకంలో భీమా సొమ్ము సంవత్సరానికి 2 లక్షలు అందులో 938 రకాల చికిత్సల కవర్ అవుతాయి. ఇ.హెచ్.ఎఫ్. పధకం క్రింద ఉద్యోగులకు కుటుంబానికి సంవత్సరానికి భీమా సొమ్ము 3 లక్షలు, 2 వేల చికిత్సలు ఇందులో కవర్అవుతాయి. అవసరాన్నిబట్టి అదనపు నిధులు అందచేస్తాయి.
24. ఇ.హెచ్.ఎఫ్. పధకం నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించింది. అవుట్ పేషెంట్ విభాగానికి ఇది వర్తిస్తుందా?
లేదు, ఒ.పి అందుబాటులో లేదు. కాని, కోణదీర్గకాలిక వ్యాధులు అయిన మధుమేహం, రక్తపోటు వంటివి కరువవుతాయి
25. సి. జి.హెచ్.ఎస్. పధకంలో మాదిరిగా కవరేజి లిమిట్ దానంతట అదే పెరుగుతుందా?
కవరేజి రూ.3 లక్షలుకే పరిమితమయింది. లబ్దిదారులు ఆర్ధిక కవరేజి మించి వైద్యం పొందలనుకుంటే, వైద్యం నిరాకరించాబడదు.
26. దీర్గకాలిక రోగాలతో బాధపడే రోగులకు ఒ.పి. విధానంలో క్రమంతప్పకుండ మందులు ఏవిధంగా అందచేస్తారు. ప్రస్తుతం సెక్రేటీరియాట్ ఉద్యోగులు అక్కడి డిసపెంసరిలు మందులు తీసుకుంటున్నారు?
నెట్వర్క్ ఆసుపత్రి ద్వారా డయాబెటిక్(మధుమేహం) వంటి వ్యాదులకు ఒ.పి ట్రీట్మెంట్ ఇవ్వబడును. నమోదయిన ఆసుపత్రి నుంచి రోగి మందులు తీసుకోవలసి వుంటుంది.
27. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ మార్గదర్శకాలు ద్వారా సాదారణంగా వొచ్చే 133 చికిత్స విధానాలను రిజర్వేడ్ జాబితాలో వుంచి వైద్యం అందించడం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేయడం జరిగింది. ఇ.హెచ్.ఎఫ్. పధకం క్రిందయితే విధానాన్ని కొనసాగిస్తారా?
లేదు. ఆరోగ్యశ్రీ పధకం వీరే రిజర్వేడ్ జాబిత కలిగివుంది. ఇ.హెచ్.ఎఫ్. కింద అటువంటి రిజర్వేడ్ జాబితను ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రకటించడం జరుగుతుంది.
28. హైద్రోసెలె, హెర్నియా రిపైర్, కాతరచ్ట్ సుర్గేరి , సాధారణ జ్వరం , శ్వసకోశ వ్యాదులు, డయేరియ మొదలయిన చికిత్స విధానాలు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పధకం కింద కవర్ లేదు. ఇ.హెచ్.ఎఫ్. పధకం వీటి చికిత్స విధానాలు కవర్ చేస్తారా?
ఆరోగ్యశ్రీ పధకంలో 933 చికిత్స విధానాలు కవర్ అయినాయి. ఇ.హెచ్.ఎఫ్. క్రింద 2 వేలు చికిత్స విధానాలు కవర్ చేసే ప్రతిపాదనలున్నాయి. ఫైన పేర్కొన్న అన్నింటికీ ఇన్ పేషెంట్ చికిత్సలు కవర్ అవుతాయి. వ్యాధులు కవరేజి వివరాలు ఇ.హెచ్.ఎఫ్ వెబ్ సైటులో చూడండి
29. ప్రస్తుతం ఆరోగ్య భీమా సంస్థలు తర్వాత సంవత్సరాలకు ప్రిమీయమ్లు పెంచుతున్నాయి. ఒక సంవత్సరంలో ప్రిమీయమ్ కంటే ఇ.హెచ్.ఎఫ్. క్రింద ఆ వ్యత్యాసాన్ని ఎలా పూరిస్తారు. ఉద్యోగుల వైద్యానికి ఖర్చు చేసే ప్రతిపారించిన మొత్తం కంటే విరాళం పెంచుతారా?
విరాళానికి సంబందించిన వివరాలు ఇంకా నిర్ణయించలేదు. ఉద్యోగిని ఫై ఎక్కువ భారం మోపడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. తక్కువ ఆర్ధిక భారంతో ఉద్యోగులకు అత్యుత్తమ వైద్య సేవలందించడం ఇ.హెచ్.ఎఫ్ ఉద్దేశం
ఆసుపత్రులు
30. ఏమ్పనేలేడ్ ఆసుపత్రులు ఏవి?
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పధకంలో ఒక నమోదయిన ఆసుపత్రుల నెట్ వర్క్ ద్వారా అమలు చేయబడుతుంది. ఏమ్పనేలేడ్ ఆసుపత్రుల గురించి ఇ.హెచ్.ఎఫ్ వెబ్ సైట్ సందర్శించండి.
31. ప్రైవేటు ఆసుపత్రులలోని ఆరోగ్యశ్రీ వార్డులే ఉద్యోగులకు కూడా వర్తింపచేస్తారా?
ఆరోగ్యశ్రీ వార్డులు ప్రత్యేకమైనవి. వాటిని ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తింప చేయడం జరగదు. ఏపిఐఎంఏ 1972 నిభందనల ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు వార్డు సౌకర్యం కల్పిస్తారు.
32. ఉద్యోగుల్ని కూడా నగదు చెల్లించి వైద్యం పొందే ఇతర సాదారణ రోగులతో సమానంగా పరిగణిస్తారా?
అవును. నగదు చెల్లింపు వైద్యంపొందే ఇతర రోగులతో సమానంగా పరిగణిస్తారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉద్యోగుల వైద్యానికి అయ్యే నగదును ముందుగా కుదుర్చుకున్న ప్యాకేజి ధరల ఆధారంగా సంబంధించిన ఆసుపత్రులకు ఎలాక్ట్రనికాల్గా బదలయిస్తారు.
33. ఒక ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య ఫై పరిమితులున్నయా?
లేదు. ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య ఫై అటువంటి పరిమితులు ఏమి లేవు
34. ఆరోగ్యశ్రీ పధకంలో వర్తించే ప్యాకేజి ధరలు, ఇ.హెచ్.ఎఫ్ కు వర్తిస్తాయా?
ఆరోగ్యశ్రీ పధకంలో సాదారణ వార్డుల ఆధారంగా ప్యాకేజి ధరలు రూపొందించడం జరిగింది. ఇ.హెచ్.ఎఫ్ లో ప్యాకేజి ధరలు ఉద్యోగికి అర్హత కలిగిన వార్డుల ఆధారంగా వుంది, వేరు వేరుగా వుంటాయి..
వివరాల అందజేత
35. వెబ్ సైట్ లో వున్న 1 వ పట్టికను సవరించడానికి వీలుందా?
అవును. 9 వ వేతన సవరణ కమిటి ఆధారంగా పట్టిక 1 లో సమాచారం తీసుకుంటాం. పోస్టుల సంఖ్య పెరిగినా, లేదా తొలగించినా, అటువంటి సమాచారాన్ని పట్టిక 1 ని సవరించడం ద్వారా పొందుపరచ వలసి వుంటుంది. పట్టిక 5 లో ఇచ్చిన సమాచారం పట్టిక 1 లో ఇచ్చిన సమాచారంతో సరిపోలివుందేందుకు చర్యలు తీసుకోవాలి. అలా కాకపోతే, పట్టిక 1 లో వున్న కొన్ని పోస్టులు ఇతర శాఖాదిపతికి చెందిన డి.డి.ఒ. కు చెందినవిగా వుంటాయి.
36. శాఖాదిపతి స్థాయిలు, ప్రథాన కార్యాలయంలో వున్న పోస్టులు మాత్రమే ఇవ్వాలా? క్షేత్రస్థాయిలో నుంచి వున్న మొత్తం పోస్టులు (జిల్లా, డి.డి.ఒ మొదలయిన ) వివరాలు ఇవ్వాలా?
ఒక శాఖ నోడల్ అధికారిగా ఫై నుంచి క్రింది వరకు వున్న పోస్టుల, రీజనల్ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల వారీగా పట్టిక 5 లో ఇవ్వాలి. 2012 ఆగస్ట్ 29 లోపున ఈ డేటా ఇవ్వాలి.
37. డి.డి.ఒ. కోడ్ తొ ఉద్యోగాల పేర్లు సరిపోతాయా? ఉద్యోగుల పేర్లు సైతం పట్టిక 5 లో పూరించాలా?
లేదు, (డి.డి.ఒ ఆఫీసు యూనిట్ పేరు) ట్రెజరీ శాఖ డైరెక్టర్, కేటాయించిన డి.డి.ఒ కోడ్ తో డి.డి.ఒ. ఆఫీసు యూనిట్ పేరే ఇవ్వాలి. ఉదా: డైరేక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖకు హోదాపరంగా డి.డి.ఒ స్టాటస్టికల్ ఆఫీసర్ గాని డి.డి.ఒ. కార్యాలయం పేరే డైరేక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఉద్యోగుల పేర్లు ఎక్కడా ఎవ్వనవసరం లేదు.
38.నమోదు చేసిన వివరాలు ఎక్కడ భద్ర పరుస్తారు? వివరాలు ఎవరి ఆధీనంలో వుంటాయి?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ తో పాటు అన్ని శాఖల వివరాలు విధిగా రాష్ట్ర డేటా సెంటరు లో భద్రపరచటం జరుగుతుంది.రాష్ట్ర డేటా సెంటరు ఐ.టి.శాఖ ఆధీనంలో వుంటుంది.ఆరోగ్యశ్రీ ట్రస్ట్ డేటాను కేవలం రోగి ఆసుపత్రికి వొచ్చినప్పుడు మరియు ఆసుపత్రికి డబ్బులు చెల్లించే సమయంలో వాడుతుంది.డేటా ఆరోగ్యశ్రీ ఆధీనంలో వుండదు.
#NaaBadi #నాబడి #WorkSheets #RemedialTeaching #TeachingTechnics #AnnualPlan #UnitPlan #LessonPlan #OnlineTests #OnlineQuizes #E-Books #StudyMaterial #DepartmentalTests #GovtOrders #Proceedings #Results #Notifications #Admissions

0 comments:

Post a Comment