Latest Updates

  ➤ View More »  

Online Tests(Quizes) for SSC Students

  ➤ View More »    ➤ View More..  


  ➤ View More..  

10 Mar 2021

(Gurukulam)V-TGCET-2021- Common Entrance Test for Admission into 5th Class for AY 2021-22 in TREIS, TSWREIS, TTWREIS, MJPTBCWREIS (21st Century Schools)

(Gurukul)V-TGCET-2021- Common Entrance Test for Admission into 5th Class for AY 2021-22 in TREIS, TSWREIS, TTWREIS, MJPTBCWREIS (21st Century Schools)

Gurukulam- V-TGCET-2021- Common Entrance Test for Admission into 5th Class for AY 2021-22 in TREIS, TSWREIS, TTWREIS, MJPTBCWREIS (21st Century Schools) Notification Released

 Common Entrance Test for Admission into 5th Class for the academic year 2021-22

(in TREIS, TSWREIS, TTWREIS, MJPTBCWREIS)

21st Century Schools

5వ తరగతి గురుకుల పాఠశాలల సీట్ల వివరాలు

క్ర.సం. సంస్థ సీట్లు
1. సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ సొసైటీ
(TSWREIS-230)
18,560
2. ట్రైబల్ వెల్పేర్ సొసైటీ
(TTWREIS-79)
4,777
3. బీసీ వెల్పేర్ సొసైటీ
(MJPTBCWREIS-261)
20,800
4. జనరల్ వెల్పేర్ సొసైటీ
(TREIS-35)
2800
5. మొత్తం(602) 46,937

కేజి టూ పిజి మిషన్ లో భాగంగా బంగారు తెలంగాణ రూపొందించే క్రమంలో దళిత, గిరిజన, బహుజనులలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తును వేయడానికి ప్రభుత్వం వందలాదిగా గురుకులాలను స్థాపించి సకల సౌకర్యాలను కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుంది. వివిధ శాఖల ఆధ్వర్యములోని గురుకుల పాఠశాలలు విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతూ 21వ శతాబ్దపు సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తర్పీదు ఇస్తున్నాయి.


వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న గురుకులాల ప్రత్యేకతలు

 1. సమర్థులు, సుదీర్ఘానుభవజ్ఞులు అయిన ఉపాధ్యాయులచే బోధన
 2. 24 గం.ల ఉపాధ్యాయుల పర్యవేక్షణ.
 3. IIT, EAMCET, NEET లాంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించుట.
 4. అధిక సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో MBBS, BDSలో ప్రవేశాలు పొందేలా ఉత్తమ శిక్షణ.
 5. సెంట్రల్ యూనివర్సిటీలు, అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, TISS వంటి ప్రతీష్ఠాత్మకమైన విశ్వ విద్యాలయాలలో ప్రవేశానికి ఉత్తమ శిక్షణ.
 6. విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి హౌస్ మాస్టర్/హౌస్ పేరెంట్ వ్యవస్థ.
 7. పాఠ్యాంశాలతో పాటు సహ పాఠ్యంశాలు, క్రీడలు మొ. వాటిపై ప్రత్యేక శ్రద్ధ.
 8. శారీరక విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) యోగాలలో శిక్షణ.
 9. అన్ని ్రపభుత్వ పరీక్షలల్లో అత్యధిక ఉత్తీర్ణతా శాతం.

*విద్యార్థులకు కల్పిచే సౌకర్యాలు:

 1. సన్న బియ్యంతో సహా అన్ని పోషక విలువలు ఉన్న చక్కటి రుచికరమైన ఆహారం అందించుట.
 2. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల ఉచిత సరఫరా.
 3. విద్యార్థులకు స్టేషనరీ (పెన్నులు, పెన్సిల్స్, రికార్డు పుస్తకాలు, వగైరా) ఉచిత సరఫరా.
 4. 3జతల స్కూల్ యూనిఫాం సరఫరా.
 5. పీ.టి.డ్రెస్, ట్రాక్, స్పోర్ట్స్ షూ, సాక్స్, నైట్ డ్రెస్ మరియు ఇతర సౌకర్యాల కల్పన.
 6. ప్లేట్, గ్లాస్, బెడ్ షీట్, బ్లాంకెట్ ల ఉచిత సరఫరా.
 7. విద్యార్థిని, విద్యార్థులకు సబ్బులు కొనుగోలుకు డబ్బులు పంపిణీ మొదలైనవి.
 8. నెలకు 4 పర్యాయాలు చికెన్, 2 పర్యాయాలు మటన్ తో భోజనం.
*పై సౌకర్యాలు, అన్ని యాజమాన్యాలలోని గురుకుల పాఠశాలల్లో అందించేందుకు ప్రభుత్వ స్థాయిలో కృషి జరుగుతున్నది.


వివిధ గురుకులాల్లో సీట్ల రిజర్వేషన్లు ఈ విధంగా ఉంటాయి.

(Gurukul)V-TGCET-2021- Common Entrance Test for Admission into 5th Class for AY 2021-22 in TREIS, TSWREIS, TTWREIS, MJPTBCWREIS (21st Century Schools)


గరుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన సమాచారం:


తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల సంస్థలచే నడుపబడుచున్న(602) గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి (ఇంగ్లీష్ మీడియం తెలంగాణ స్టేట్ సిలబస్)లో

ప్రవేశానికి దరఖాస్తులు కోరబడుచున్నవి.ప్రవేశ పరీక్ష తేది 30.05.2021 నాడు ఉదయం 11:00 గం.ల నుండి మధ్యాహ్నము 1:00గం.ల వరకు

రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించబడిన అన్ని జిల్లా కేంద్రాలలో, పరిసర ప్రాంతాలలో నిర్వహించబడును.

I)అర్హత:

1)వయస్సు
 1. ఎ)ఓ సి (OC) మరియు బి.సి. (BC) కులాలకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 లొపల పుట్టి ఉండవలెను (అంటే 9సం. లు నిండి ఉండవలెను కానీ 11 సం.రాలు నిండరాదు).
 2. బి) యస్ సి (SC) మరియు యస్ టి ల (ST) కు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 లోపల పుట్టి ఉండవలెను (అంటే 9 సం.లు నిండి ఉండవలెను కానీ 13 సం.రాలు నిండరాదు.
 3. సి) SC కన్వెర్టడ్ క్రైస్తవ విద్యార్థులు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య జన్మించినవారు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలకు అర్హలు.
 4. డి) సంవత్సర ఆదాయము రూరల్ వారికి 1,50,000/- అర్బన్ వారికి 2,00,000/- రూపాయల వార్షిక ఆదాయములోపు ఉండవలెను.

II) పాఠశాలల్లో  ప్రవేశము:

 1. విద్యార్థుల ఎంపికకు ‘‘పాత జిల్లా’’ ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది.
 2. MJPTBCWRS కౌడిపల్లి పాఠశాలలో  ప్రవేశమునకుగాను మత్స్యకార వృత్తికి చెందిన తెలంగాణలోని అన్ని జిల్లాలవారు  అర్హులు.  ఈ పాఠశాలల్లో ప్రవేశానికి అభ్యర్థి ప్రతిభ, రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు.
 3. TRS(TRIBAL RESIDENTIAL SCHOOLS) సర్వేల్ (నల్గొండ జిల్లా) రీజనల్ సెంటర్ ఆప్ ఎక్స్ లెన్స్ పాఠశాలలో ప్రవేశానికి, తెలంగాణలోని అన్ని జిల్లాలవారు అర్హులు. ఈ పాఠశాలలో ప్రవేశానికి అభ్యర్థి ప్రతిభ, రిజర్వేషన్ ప్రతిపాదికన ప్రవేశాలు కల్పస్తారు.

III) ప్రవేశ పరీక్ష:

 1. A) ప్రవేశ పరీక్ష 1. తెలుగు, 2.ఇంగ్లీషు, 3. గణితము, 4. మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం), 5. పరిసరాల విజ్ఞానములలో 3,4వ తరగతి స్థాయిలో 2 గం.ల వ్యవధిలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది
  (తెలుగు-20,
  ఇంగ్లీషు-25,
  గణితము-25,
  పరిసరాల విజ్ఞానము-20 మరియు
  మెంటల్ ఎబిలిటీ-10 మార్కులతో).
 2. B) (OMR) ఓ.యం.ఆర్. షీట్ లో జవాబులు గుర్తించవలెను (Bubbling).
 3. C) విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నపత్రము మరియు నమూనా ఓ.యం.ఆర్ జవాబు పత్రములు పట్టిక (Annexure-II) మరియు (Annexure-II) నందు ఇవ్వబడినవి.
 4. D) ప్రవేశ పరీక్ష ప్రశ్రపత్రము తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలో ఉంటుంది.

IV) పరీక్ష కేంద్రాలు:


సంబంధిత జిల్లా అధికారులచే నిర్ణయించబడిన పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును.

V)  పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం

 1. ప్రవేశ పరీక్షలో ప్రతిభ (Merit in Test).
 2. రిజర్వేషన్ ప్రకారం (ఆయా సంస్థల నియమాల ప్రకారం).
 3. స్థానికత
 4. ప్రత్యేక కేటగిరి (మైనారిటీలు/అనాథ బాలబాలికలు/ సైనికోద్యోగుల పిల్లలు/ ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థుల/ ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగస్తుల పిల్లలు).
 5. విద్యార్థుల ఎంపికలో సమానమైన మార్కులు, ఒకరికంటే ఎక్కువమందికి వచ్చినపుడు, పుట్టినతేది, గణితంలో మార్కులు, పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను ఒకటి తర్వాత ఒకటి వరుసగా పరిగణనలోకి తీసుకోని ర్యాంకు నిర్ఢారిస్తారు.
 6. ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ (దవ్యాంగులు), సైనికోద్యోగుల పిల్లలకు సంబంధించిన రిజర్వేషన్ లు ఆయా కులానికి చెందిన రిజర్వేషన్ కోటాలోనే ఉంటుంది.
 7. ఏదైనా ఒక రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులు లేనియెడల అట్టి రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు కేటాయించే అధికారం ప్రధాన కన్వీనర్ గారికి ఉంటుంది.
 8. ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన (అంగవైకల్యం, అనాధ, సైనికోద్యోగుల పిల్లలు) ఖాళీలు మిగిలినచో అట్టి ఖాళీలను మెరిట్ ప్రాతిపదిక ప్రభుత్వ సూచనల ప్రకారం కేటాయిస్తారు.
 9. అర్హులైన ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు / ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగస్తుల పిల్లలు లభించనియెడల అట్టి ఖాళీలు ఎస్టీ విద్యార్థులతో, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నింపబడును.
 10. ఎంపికైన అభ్యర్థులు ప్రవేశానికి ఏ కారణం చేతనైన అర్హులు కానిచో, అట్టి ప్రవేశానికి నిరాకరించుటకు ప్రధాన కన్వీనర్ గారికి అధికరం ఉంది.

VI) దరఖాస్తు చేయు విధానం

 1. అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకుని సంతృప్తిచెందిన తరువాత
  1. www.tswreis.in
  2. http:/tgcet.cgg.gov.in
  3. http:/tgtwgurukulam.telangana.gov.in
  4. http:/mjptbcwreis.telangana.gov.in
  5. http:/tresidential.gov.in

  సైట్ లో ఆన్ లైన్ ద్వారా ప్రాథమిక వివరాలు అనగా

  1. అభ్యర్థి పేరు,
  2. పుట్టిన తేదీ,
  3. మొబైల్ నెంబర్ (ఖచ్చితముగా తల్లిదండ్రులదే ఇవ్వాలి, నెట్ సెంటర్ ది ఇవ్వకూడదు),
  4. సంబంధిత జిల్లా పేరు 
  నమోదు చేసి రూ.100/- (వంద రూపాయలు) నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డ్/ డెజిట్ కార్డ్ ద్వారా చెల్లించిన తరువాత ఒక రిఫరెన్స్ ఐడి నెంబరు ఇవ్వబడుతుంది. వెంటనే దరఖాస్తు ఫారం కనపడుతుంది. ఆ ఫారంలో అన్ని వివరాలు నింపాలి.

  పరీక్ష తేదికి 10 రోజుల ముందు నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.

  ఒక విద్యార్థి కోసం నమోదు చేయబడిన మొబైల్ నెంబరుతో మరో విద్యార్థి దరఖాస్తు స్వీకరించబడదు.
 2. ఏ కారణంచేతనైనా (కరెంట్ పోవడం / సిస్టమ్ పనిచేయకపోవడం మొదలగునవి కారణాల వల్ల) వెంటనే దరఖాస్తు నింపలేనియెడల ఆ తరువాత ఆన్ లైన్ చివరి తేదీ లోపల ఎప్పుడైనా దరఖాస్తు రిఫరెన్స్ ఐడి నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో దరఖాస్తు నింపి టికెట్ పొందవచ్చును.
 3. రిఫరెన్స్ ఐడి నెంబర్ పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకున్నట్లు కాదు అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నంబర్ మాత్రమే దరఖాస్తు నింపనట్లైత హాల్ టికెట్ డౌన్ లోడ్ కాదు. హాల్ టికెట్ లేనట్లయితే పరీక్షకు ఏ సెంటర్ లోనూ అనుమతించబడరు.
 4. గడువు ఆన్ లైన్ ద్వారా తేదీ 10.03.2021 నుండి 03.04.2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును.
 5. ఆన్ లైన్ లో దరఖాస్తును నింపిన తరువాత హాల్ టికెట్ ను పరీక్ష తేదీకి 10 రోజుల ముందు నుండి లోడ్ అవుతుంది. నింపిన దరఖాస్తు ప్రింట్ కాపీని హాల్ టికెట్ ను ప్రింట్ తీసుకోని భద్రపరుచుకోవలెను.
 6. నమూనా దరఖాస్తు ఫారం పట్టిక (Annexure-IV)లో ఇవ్వబడినది దరఖాస్తును ఆన్ లైన్ ద్వారా నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును నింపుకొని ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటోను కూడా తీసుకొని వెళ్ళాలి ఫోటో క్రింద విద్యార్థి యొక్క సంతకాన్ని స్కాన్ చేసి ఆన్ లైన్ లో చూపిన విధముగా అప్ లోడ్ చేయవలెను.
 7. దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్థి కుల ధృవీకరణ, పుట్టిన తేదీ ధృవీకరణ మొదలగు పత్రాలు (ఒరిజనల్) పొందియుండాలి. ఒకవేళ దరఖాస్తు సమయానికి లేని యెడల అట్టి వారు పైన తెలిపిన ధృవీకరణ పత్రాలు ప్రవేశ సమయానికల్లా పొంది యుండవలెను. ధృవపత్రాల ఒరిజినల్స్ ప్రవేశ సమయానికల్లా తప్పక సమర్పించాలి. లేనియెడల విద్యార్థి ఎంపిక రద్దు చేయబడును. ప్రవేశము కల్పించబడదు.
 8. ఆన్ లైన్ లో కాక నేరుగా గురుకుల విద్యాలయాల సంస్థలకు గాని, గురుకుల పాఠశాలలకు గాని పంపిన దరఖాస్తులు పరిశీలించబడవు. అట్టి అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.

VII) దరఖాస్తు నింపుటలో అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు:

 1. దరఖాస్తును ఆన్ లైన్ లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును నింపుకోవాలి.
 2. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో (4.5CM X 4.5CM)ను, విద్యార్థి సంతకంతో సిద్ధంగా వుంచుకోవాలి.
 3. దరఖాస్తును నింపునపుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను.
 4. దరఖాస్తు నింపుటలో జరుగు పొరపాట్లకు అభ్యర్థి యొక్క తల్లిదండ్రులు (లేదా) సంరక్షకులదే పూర్తి బాధ్యత. TSWREIS, TTWREIS, MJPTBCWREIS మరియు CGGలు ఎటువంటి బాధ్యత వహించవు.
 5. తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు.
 6. ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత ఎలాంటి మార్పులకు అవకాశం లేదు కావున దరఖాస్తు  అప్ లోడ్ చేయుటకు ముందే అన్ని వివరములు సరిచూసుకోవలెను.
 7. ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశమునకు అర్హలుకారు.
 8. ఫోన్ నెంబర్ ఖచ్చితంగా తల్లిదండ్రులలో ఒకరిది ఇవ్వాలి. (నెట్ సెంటర్ ది ఇవ్వరాదు)
 9. జిల్లా పట్టిక (ANNEXURE-V)లో ఇవ్వబడినది. దాని ప్రకారమే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడుతాయి.

NOTE(గమనిక):

 1. ఏ సమయంలోనైనా అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా అవసరమైన మార్పులు చేయుటకు / రద్దుచేయుటకు సంపూర్ణ అధికారము ప్రధాన కన్వీనర్ కు కలదు. ఒక పరీక్షా కేంద్రానికి కేటాయించబడిన అభ్యర్థి వేరొక పరీక్షా కేంద్రములో పరీక్ష రాయడానికి అనుమతించబడదు.
 2. హాల్ టికెట్ డౌన్ లోడ్ (దిగుమతి) చేసికొన్న తరువాత విద్యార్థి / తల్లిదండ్రులు పరీక్షా కేంద్రమును స్వయంగా పర్యవేక్షించుకొని, తగిన రవాణా సౌకర్యాలు ఏర్పాట్లు చేసికొనవలెను.
 3. పరీక్ష మొదలైన 10ని.ల తరువాత ఎట్టి పరిస్థితులలోను అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు.
 4. పరీక్ష కేంద్రానికి అభ్యర్థి పరీక్ష ప్యాడ్ (Exam Pad) నీలి / నలుపు రంగు బాల్ పాయింట్ పెన్ను తప్పక తీసికొని వెళ్లవలెను.
 5. ఇంకా ఏమైనా వివరాలు కావలసినా, ఏదైనా సమస్య ఎదురైనా సమీప గురుకు పాఠశాల ప్రన్సిపల్ ను (లేదా) క్రింది నెంబరులను సంప్రదించవచ్చును.

  180042545678 (TSWREIS)
  040-24734899 (TREIS)
  9121174434 (TTWREIS)
  040-23328266 (MJPTBCWREIS)

Important Links of TGCET-2021

Sl No View
1 TGCET-2021 Notification
2 Model OMR Sheet
3 Model Question Paper
4 Exam Date: 30/05/21
11:00AM to 1:00 PM
5 Payments:
10/03/2021
To
03/04/2021
6 Applications:
10/04/2021
To
03/04/2021
7 Online Payment Link
8 Online Applications Link
9 Download Submitted Applicaion
10 http:/tgcet.cgg.gov.in
#NaaBadi #నాబడి #WorkSheets #RemedialTeaching #TeachingTechnics #AnnualPlan #UnitPlan #LessonPlan #OnlineTests #OnlineQuizes #E-Books #StudyMaterial #DepartmentalTests #GovtOrders #Proceedings #Results #Notifications #Admissions

0 comments:

Post a Comment